COVID-19: ఏపీలో మరో 50 మందికి కరోనా.. కర్నూలులో 566కి చేరిన పాజిటివ్ కేసులు

coronavirus cases in ap
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,666 శాంపిళ్లను పరీక్షించగా 50 మందికి కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,980గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 925 మంది డిశ్చార్జ్ కాగా, 45 మంది మరణించారని వివరించింది.

ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,010గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 5, చిత్తూరులో 16, గుంటూరులో 6, కడపలో 1, కృష్ణాలో 1, నెల్లూరులో 5, కర్నూలులో 13, ప్రకాశంలో 2, విశాఖపట్నంలో 1 కేసు నమోదయ్యాయి. కర్నూలులో కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 566కి చేరింది.
 
జిల్లాల వారిగా కరోనా కేసుల వివరాలు..
                       
Go Back to Shorts
COVID-19
Corona Virus
Andhra Pradesh

More Telugu News