Prabhas: మరో రికార్డును సాధించిన ప్రభాస్ మూవీ

  • ప్రభాస్ నుంచి వచ్చిన మరో భారీ చిత్రం
  • కథానాయికగా సందడి చేసిన శ్రద్ధా కపూర్
  • ఏప్రిల్ 25న హిందీ వెర్షన్ ప్రసారం
Saho Movie

ప్రభాస్ కథానాయకుడిగా ఆ మధ్య వచ్చిన 'సాహో' భారీ చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో కథాకథనాల పరంగా అంతగా మెప్పించలేకపోయినా, హిందీలో మాత్రం మంచి వసూళ్లనే రాబట్టింది.  శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ .. నీల్  నితిన్ ముఖేష్ వంటి  బాలీవుడ్  స్టార్స్ నటించారు.  సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీ వెర్షన్ ను ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా  ప్రసారం చేశారు.

పట్టణ ప్రాంతాల్లో 5,30 3,000 ఇంప్రెషన్స్ .. గ్రామీణ ప్రాంతాల్లో 3,300 000 ఇంప్రెషన్స్ లభించాయి. ఇలా ఈ సినిమా 8.33 మిలియన్ ఇంప్రెషన్స్ ను సొంతం చేసుకుంది. 2020లో 17వ వారంలో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా ఇది కొత్త రికార్డును సృష్టించింది.  ఇదే వారంలో ప్రసారమైన 'బాహుబలి ది బిగినింగ్' ఇంప్రెషన్స్ పరంగా రెండో స్థానంలో నిలిచింది. ఆ తరువాత స్థానాల్లో రజనీకాంత్ 'దర్బార్' .. అక్షయ్ కుమార్ 'హౌస్ ఫుల్ 4' .. అమితాబ్ 'సూర్యవంశ్' నిలిచాయి.  కోలీవుడ్ .. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలకి సంబంధించిన సినిమాల ఇంప్రెషన్స్ ను ప్రభాస్ బీట్ చేయడం విశేషం.

More Telugu News