Corona Virus: ఏపీలో 24 గంటల్లో మరో 43 మందికి కరోనా.. 44కి చేరిన కరోనా మృతుల సంఖ్య

coronavirus cases in ap
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,388 శాంపిళ్లను పరీక్షించగా 43 మందికి కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,930గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 887 మంది డిశ్చార్జ్ కాగా, 44 మంది మరణించారని వివరించింది.

ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 999గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 3, చిత్తూరులో 11, గుంటూరులో 2, కృష్ణాలో 16, కర్నూలులో 6, విశాఖపట్నంలో 5 కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారిగా వివరాలు..
       
        
గ్రాఫ్ రూపంలో..
 
 
Go Back to Shorts
Corona Virus
COVID-19
Andhra Pradesh

More Telugu News