Pavan kalyan: సంక్రాంతి బరిలోకి 'వకీల్ సాబ్'!

  • షూటింగు  దశలో 'వకీల్ సాబ్'
  • 60 శాతం షూటింగు పూర్తి
  • ఆగస్టులో పూర్తికానున్న చిత్రీకరణ  
Vakeel Saab Movie

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకోవలసింది. కానీ లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. పవన్ కల్యాణ్ పోర్షన్ కి సంబంధించి 20 రోజుల చిత్రీకరణ మిగిలివుంది. ఇతర పాత్రల కాంబినేషన్లో మరో 20 రోజుల చిత్రీకరణ చేయవలసి వుంది.  అంటే ఇంకా 40 రోజుల చిత్రీకరణ జరపవలసి వుంది.

అందువలన లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత తిరిగి షూటింగును ఆరంభిస్తే, ఆగస్టులో షూటింగు పార్టు పూర్తవుతుందని అంటున్నారు. అయితే దసరా .. దీపావళి .. క్రిస్మస్ పర్వదినాల్లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచన 'దిల్'  రాజుకి లేదని చెబుతున్నారు. ఆయన ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దింపాలని భావిస్తున్నాడట. సంక్రాంతికి ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చాడని అంటున్నారు.

అయితే, ఒకవేళ ముందుగా చెప్పినట్టే  'ఆర్ ఆర్ ఆర్' కూడా సంక్రాంతికి వస్తే కనుక అప్పుడు వేరే ఆలోచన చేయవచ్చనేది 'దిల్' రాజు ఆలోచనట. ఇక  తమిళ .. హిందీ భాషల్లో భారీ విజయాన్ని అందుకున్న ఈ కథ, తెలుగులో ఏ స్థాయిలో ఆదరణ పొందుతుందో చూడాలి.

More Telugu News