Corona Virus: ఏపీలో మరిన్ని పెరిగిన కరోనా కేసులు.. 24 గంటల్లో 54 మందికి కొత్తగా కొవిడ్‌-19 నిర్ధారణ

coronavirus cases in ap
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో7,320 శాంపిళ్లను పరీక్షించగా 54 మందికి కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,887గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 842 మంది డిశ్చార్జ్ కాగా, 41 మంది మరణించారని వివరించింది.

ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,004గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 16, చిత్తూరులో 3, గుంటూరులో 1, కృష్ణాలో 6, కర్నూలులో 7, విశాఖపట్నంలో 11, విజయ నగరంలో 1 కేసు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరిలో 9 కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారిగా వివరాలు..
       
       
గ్రాఫ్ రూపంలో..
                  
Go Back to Shorts
Corona Virus
COVID-19
Andhra Pradesh

More Telugu News