నాగ్ అశ్విన్ మూవీలో డిఫరెంట్ లుక్ తో ప్రభాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాగ్ అశ్విన్ మూవీలో డిఫరెంట్ లుక్ తో ప్రభాస్

Prabhas Movie
  • షూటింగు దశలో ప్రభాస్ తాజా చిత్రం
  • భారీ బడ్జెట్ తో నాగ్ అశ్విన్ చిత్రం
  • తదుపరి సినిమా ప్రశాంత్ నీల్ తో?    
ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేసి చిత్రీకరణ జరుపుతూ వచ్చారు. అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగు వాయిదా పడింది. ఈ సినిమా తరువాత దర్శకుడు నాగ్ అశ్విన్ తో కలిసి ప్రభాస్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. రెండేళ్ల పాటు స్క్రిప్ట్ పై కసరత్తు చేసిన నాగ్ అశ్విన్, స్క్రిప్ట్ పక్కాగా వచ్చింది అని సంతృప్తి చెందిన తరువాతనే రంగంలోకి దిగినట్టు సమాచారం.  

వైజయంతీ  మూవీస్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ కారణంగానే ఆయా భాషలకి చెందిన ఆర్టిస్టులను తీసుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ను నాగ్ అశ్విన్ ప్రత్యేకంగా డిజైన్ చేశాడట. ఆయన హెయిర్  స్టైల్ .. గెడ్డం .. మీసకట్టు .. కాస్ట్యూమ్స్ భిన్నంగా వుంటాయని అంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంతవరకూ ప్రభాస్ కనిపిస్తూ వచ్చిన దానికి భిన్నంగా ఈ సినిమాలో ఆయన కనిపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమా తరువాత 'కేజీఎఫ్' దర్శకుడితో ప్రభాస్ సినిమా వుంటుందనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకూ నిజమవుతుందన్నది చూడాలి మరి.
Prabhas
Radhakrishna Kumar
Tollywood

More Telugu News