Nagachaitanya: చైతూ నిర్మాణంలో హీరోగా రాజ్ తరుణ్

  • చైతూ .. సమంతల సొంత బ్యానర్?
  • దర్శకుడిగా శ్రీనివాస్ గవిరెడ్డికి అవకాశం
  • త్వరలో పూర్తి వివరాలు  
Chaitu

ఒక వైపున నాగచైతన్య .. మరో వైపున సమంత ఆర్టిస్టులుగా బిజీగా వున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ ఇద్దరూ కలిసి సొంత బ్యానర్ ను ఏర్పాటు చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అది నిజమేననే టాక్ మరింత పుంజుకుంది.

చైతూ .. సమంత సొంత బ్యానర్లో తొలి హీరోగా రాజ్ తరుణ్ ఛాన్స్ కొట్టేశాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. గతంలో రాజ్ తరుణ్ హీరోగా దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' సినిమాను తెరకెక్కించాడు. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ దర్శకుడు తాజాగా చైతూ .. సమంతలకు ఒక కథను వినిపించాడట. ఆ కథను తమ బ్యానర్లో చేయడానికి చైతూ .. సమంత అంగీకరించినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమాకి సంబంధించిన పనులు మొదలుకానున్నట్టు చెబుతున్నారు. మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.

More Telugu News