Andhra Pradesh: ఏపీలో రాత్రి ఏడు గంటలతో ముగిసిన మద్యం విక్రయాలు

  • ఏపీ వ్యాప్తంగా ఈరోజు తెరచుకున్న మద్యం దుకాణాలు 
  • ఉదయం 11 గంటల నుంచి 7 గంటల వరకు విక్రయాలు
  • మద్యం షాపుల వద్ద 7 గంటల వరకు క్యూలో ఉన్న వారికి స్లిప్పులు
Todays Liquor sales in AP close at seven o clock in the night

ఏపీ వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకున్న విషయం తెలిసిందే. ఉదయ 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం అమ్మకాలు కొనసాగాయి. ఈ సందర్భంగా విశాఖ అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ, మద్యం దుకాణాల వద్ద రాత్రి ఏడు గంటల వరకు వరుసలో నిలబడి ఉన్న వారికి స్లిప్పులను అధికారులు అందజేశారని, ఈ స్లిప్పులు ఉన్న వారికి రేపు ముందుగా మద్యం విక్రయిస్తామని, ఆ తర్వాతే మిగిలిన వారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు.

More Telugu News