Hebah Patel: వెబ్ సిరీస్ ల దిశగా హెబ్బా పటేల్

  • హెబ్బాకి తగ్గిన అవకాశాలు
  • ఇతర భాషల్లోనూ అందని అవకాశాలు
  • వెబ్ సిరీస్ ల పైనే ప్రత్యేక దృష్టి    
Hebah Patel

తెలుగులో వెబ్ సిరీస్ ల సంస్కృతి ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ప్రస్తుతం వెండితెరపై మంచి క్రేజ్ వున్న వారు, వెబ్ సిరీస్ లను కూడా ఒకసారి టచ్ చేద్దామని ఉత్సాహాన్ని చూపుతుంటే, అవకాశాలు తగ్గినవాళ్లు మరో ఆదాయ మార్గంగా వెబ్ సిరీస్ లను ఎంచుకుంటున్నారు. అలా వెబ్ సిరీస్ ల దిశగా అడుగులు వేస్తున్న వారి జాబితాలో హెబ్బా పటేల్ కూడా కనిపిస్తోంది.

ఆరంభంలో కథానాయికగా కుర్రకారును ఒక ఊపు ఊపేసిన హెబ్బా పటేల్ కి, ఈ మధ్య కాలంలో అవకాశాలు చాలా వరకూ తగ్గిపోయాయి. ఇతర భాషల్లోను పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఈ నేపథ్యంలో ఆమె వెబ్ సిరీస్ ల పై దృష్టి పెట్టింది. నెట్ ఫ్లిక్స్ వారు నిర్మించే రెండు వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆమె ఓకే చెప్పిందని అంటున్నారు. అడల్ట్ రేటెడ్ స్టైల్లో ఈ వెబ్ సిరీస్ లు వుంటాయని చెబుతున్నారు. ఈ వెబ్ సిరీస్ లలో హెబ్బా చాలా బోల్డ్ గా కనిపిస్తుందని అంటున్నారు.

More Telugu News