నన్ను ఇంతటివాడ్ని చేసిన మహనీయుడు ఆయనే: మోహన్ బాబు
- నేడు దాసరి జన్మదినం
- ట్విట్టర్ లో స్పందించిన మోహన్ బాబు
- ఆయన ఆశీస్సులు తన కుటుంబానికి ఉంటాయంటూ వ్యాఖ్యలు
"తల్లిదండ్రులు నాకు భక్తవత్సలం అని పేరుపెట్టారు. కానీ నటుడిగా నాకు జన్మను ప్రసాదించిన గురువు దాసరి నారాయణరావు గారు 'మోహన్ బాబు' అని నామకరణం చేశారు. నాకు విలన్ గా, హీరోగా, కమెడియన్ గా, క్యారక్టర్ గా ఆర్టిస్టుగా అన్ని రకాల పాత్రలు ఇచ్చి నన్ను ఇంతటివాడ్ని చేసిన మహనీయుడు, తండ్రి లాంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు" అంటూ కీర్తించారు.