సత్ఫలితాలనిస్తున్న రెమ్డెసివిర్ ఔషధం.. అమెరికాలో వినియోగానికి లభించిన అనుమతి!
- మిగతా ఔషధాల కంటే 31 శాతం అధిక ప్రభావం
- అత్యవసర వినియోగానికి మాత్రమే అనుమతి
- ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
రెమ్డెసివిర్ ఔషధాన్ని తీసుకున్న రోగులు మిగతా ఔషధాలతో పోలిస్తే 31 శాతం వేగంగా అంటే సగటును నాలుగు రోజుల ముందే కోలుకుంటున్నట్టు అధ్యయనంలో తేలినట్టు ఎఫ్డీఏ తెలిపింది. ఈ కారణంగానే దాని వినియోగానికి అనుమతి ఇచ్చినట్టు పేర్కొంది. ఈ డ్రగ్ వినియోగంలో మనుషులకు ఎలాంటి అపాయం ఉండదనడానికి మరిన్ని బలమైన ఆధారాలు సమర్పిస్తే పూర్తిస్థాయి వినియోగానికి అనుమతి ఇస్తామని వివరించింది.