Prabhas: ప్రభాస్ సినిమాకి స్క్రిప్టు సిద్ధం

  • 'బాహుబలి'తో పెరిగిపోయిన మార్కెట్ 
  • నాగ్ అశ్విన్ తో అంతర్జాతీయ చిత్రం
  • వివిధ దేశాలలో చిత్ర నిర్మాణం
Story has been ready for Peabhas movie

'బాహుబలి' సినిమా తర్వాత ప్రభాస్ ఇమేజ్, మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన సినిమాల బడ్జెట్ విపరీతంగా పెరిగింది. ఆయన సినిమాల నిర్మాణాన్ని కథ నుంచీ పాన్ ఇండియా దృష్టితో ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రభాస్ తో 'మహానటి' ఫేం నాగ్ అశ్విన్ ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మించే ఈ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రంగా డిజైన్ చేస్తున్నారు. కథ, ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, చిత్ర నిర్మాణం.. అన్నీ అంతర్జాతీయ స్థాయిలోనే ప్లాన్ జరుగుతోంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనిని దర్శకుడు నాగ్ అశ్విన్ పూర్తి చేసినట్టు, చాలా సంతృప్తికరంగా వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ తో ప్రభాస్ చేస్తున్న సినిమా నిర్మాణం లాక్ డౌన్ ముగిసిన వెంటనే పూర్తిచేస్తారు. ఇక ఆ తర్వాత ప్రభాస్ ఈ చిత్రం షూటింగులో జాయిన్ అవుతాడట.

వివిధ దేశాల లొకేషన్లలో ఈ చిత్రం షూటింగును నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం ప్రభాస్ ఇమేజ్ ని మరో మెట్టు ఎక్కిస్తుందన్న అభిప్రాయాలు టాలీవుడ్ లో వ్యక్తమవుతున్నాయి.   

More Telugu News