తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం!

Telangana weather forecast
  •  రేపటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు
  • ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడొచ్చు
  • హైదారాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. రేపటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో పాటు  తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

దక్షిణ ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, ఆగ్నేయ రాజస్థాన్ నుంచి పశ్చిమ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
Go Back to Shorts
Telangana
Rains
Hyderabad Meteorological Center

More Telugu News