‘కొవిడ్-19’ పై ఇండోనేషియా అధ్యక్షుడితో చర్చించిన ప్రధాని మోదీ

Narendra Modi discussed with Indonesia president joco widodo
  • ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో  
  • ఈ సంక్షోభంతో ఆర్థిక, ఆరోగ్య అంశాలపై సవాళ్లు  
  • ఇరు దేశాల మధ్య సన్నిహిత సహకారం ముఖ్యమన్న మోదీ
‘కొవిడ్-19’ మహమ్మారి గురించి ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో భారత ప్రధాని మోదీ చర్చించారు. ఈ విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ మహమ్మారిపై మంచి మిత్రుడు జోకో విడోడోతో చర్చించానని పేర్కొన్నారు. సాగరానికి ఇరుగుపొరుగు వాళ్లంగా, సమగ్ర వ్యూహాత్మక భాగస్వాములుగా.. ఈ సంక్షోభం కారణంగా తలెత్తిన ఆర్థిక, ఆరోగ్య అంశాలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇరు దేశాల మధ్య  సన్నిహిత సహకారం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
Go Back to Shorts
Narendra Modi
Prime Minister
India
Indonesiq
joko widodo

More Telugu News