రెండేళ్ల క్రితం ఆపేసిన పాత ట్విట్టర్ ఖాతా 'పీకే క్రియేటివ్ వర్క్స్'లో పవన్ కల్యాణ్ ట్వీట్!
- 2018 తరువాత ట్వీట్లు చేయని పవన్
- 'జానీ' విడుదలై 17 సంవత్సరాలు
- ట్వీట్ తో నాటి విశేషాలు పంచుకున్న పవన్
నాడు స్వయంగా నటించి, డైరెక్షన్ చేసిన 'జానీ' వచ్చి 17 సంవత్సరాలు అయిన సందర్భంగా సినిమా అనుభవాలను పవన్ పంచుకున్నారు. ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చేసిన ట్వీట్ కు పవన్ రిప్లయ్ ఇచ్చారు. రిక్షా తొక్కుతున్న ఓ చిత్రాన్ని షేర్ చేసిన పవన్, అందులో ఉన్న తన దర్శకత్వ టీమ్ గురించి మాట్లాడారు. పవన్ తన సినిమాలను గురించి చెప్పేందుకు మరోసారి ట్విట్టర్ ను వాడటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.