"డియర్ పవన్ కల్యాణ్" అంటూ చాన్నాళ్లకు తెరపైకి వచ్చిన రమణ గోగుల

Ramana Gogula wishes Pawan Kalyan on Johnny release day
  • ఇవాళ 'జానీ' రిలీజ్ డే
  • పవన్ కు విషెస్ తెలిపిన రమణ గోగుల
  • నిన్నో,మొన్నో కలిసి పనిచేసినట్టుందంటూ ట్వీట్
పవన్ కల్యాణ్ తో తమ్ముడు, బద్రి, జానీ వంటి సినిమాలకు హిట్ సంగీతం అందించిన వెర్సటైల్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల చాన్నాళ్ల తర్వాత తెరపైకి వచ్చారు. చాన్నాళ్ల కిందటే టాలీవుడ్ నుంచి తప్పుకున్న రమణ గోగుల తాజాగా పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. "డియర్ పవన్ కల్యాణ్, జానీ సినిమా కోసం మనం మ్యూజిక్ సిట్టింగ్స్ నిర్వహించి 17 ఏళ్లయిందంటే నమ్మలేకపోతున్నాను. ఏదో నిన్నో,మొన్నో కలిసినట్టుంది. జానీ తర్వాత మన ప్రస్థానం ఘనంగా సాగిందనే అనుకుంటున్నాను. జానీ రిలీజ్ డే సందర్భంగా శుభాభినందనలు" అంటూ రమణ గోగుల భావోద్వేగభరితంగా స్పందించారు.

రమణ గోగుల ఒక దశలో టాలీవుడ్ అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన తెలుగులో చివరిగా సంగీతం అందించిన చిత్రం వెంకటాద్రి ఎక్స్ ప్రెస్. 2013 తర్వాత రమణ గోగుల చిత్రపరిశ్రమకు గుడ్ బై చెప్పారు. ఖరగ్ పూర్ ఐఐటీ నుంచి ఎంటెక్, లూసియానా స్టేట్ యూనివర్శిటీ నుంచి ఎంఎస్ (కంప్యూటర్ సైన్స్) చేసిన రమణ గోగుల ప్రస్తుతం తన సంస్థల కార్యకలాపాలు చూసుకుంటున్నారు.
Go Back to Shorts
Ramana Gogula
Pawan Kalyan
Johnny
Release Day
Tollywood

More Telugu News