Rana: నక్సలైట్ పాత్రలో ప్రియమణి

  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో రానా
  • నక్సలైట్ పాత్రలో సాయిపల్లవి
  • 70 శాతం షూటింగు పూర్తి  
Virata Parvam Movie

రానా కథానాయకుడిగా వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సాయిపల్లవి నటిస్తోంది. పోలీస్ ఆఫీసర్ గా రానా కనిపించనున్నాడనే టాక్ వచ్చింది. ఇక నక్సలైట్ గా సాయిపల్లవి కనిపించనుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో ప్రియమణి ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు  వచ్చాయి.

దాంతో ఆమె ఏ పాత్రలో కనిపించనుందనేది ఆసక్తికరంగా మారింది. ఆమె కూడా నక్సలైట్ పాత్రలో కనిపించనుందనేది తాజా సమాచారం. ఇంతవరకూ 70 శాతం చిత్రీకరణ జరుపుకుంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ స్టీఫెన్ రిచర్డ్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ప్రియమణిపై కూడా యాక్షన్ సీన్స్ వున్నాయట. ఇక ఆమె 'నారప్ప' సినిమాలోను కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News