నా కెరీర్ ట్రాక్ లో పడింది: హీరో నవదీప్

Navadeep
  • కెరీర్ ను తెలివిగా ప్లాన్ చేసుకుంటున్నాను
  • ఆర్టిస్ట్ గా ప్రస్తుతం బిజీగానే వున్నాను
  • ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదన్న నవదీప్
తెలుగు తెరకి హీరోగా పరిచయమైన నవదీప్, ఆశించిన స్థాయిలో సక్సెస్ లను అందుకోలేకపోయాడు. యువ కథానాయకుల రేసులో వెనకబడిన ఆయన, ఆ తరువాత నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "కొంతకాలం క్రితం వరకూ నా కెరియర్ పట్ల అసంతృప్తి వుండేది. ఇటీవల కాలంలో ఆశాజనకంగానే వుంది.

వెబ్ సిరీస్ లు చేస్తున్నాను .. అలాగే తెలుగులో 'మోసగాళ్లు' సినిమాలో విలన్ గా చేశాను. ఆ పాత్ర నాకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందనే నమ్మకం వుంది. మరో రెండు తెలుగు సినిమాలకు .. ఒక తమిళ సినిమాకు సైన్ చేశాను. ఇక నుంచి కెరియర్ ను తెలివిగానే ప్లాన్ చేసుకుంటాను. ఇక ఎక్కడికి వెళ్లినా అందరూ 'పెళ్లెప్పుడు' అని అడుగుతున్నారు. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు. ఆర్ధికంగా నిలదొక్కుకున్న తరువాతనే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Navadeep
Actor
Tollywood

More Telugu News