ఫేస్ బుక్ లో తిరుగులేని ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ
- 4.5 కోట్ల లైకులతో వరల్డ్ నెంబర్ వన్ గా మోదీ
- అత్యధిక స్పందనల విషయంలో ట్రంప్ కు అగ్రస్థానం
- బీసీడబ్ల్యూ అధ్యయనంలో ఆసక్తికర వివరాలు వెల్లడి
మోదీ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2.7 కోట్ల మంది ఫేస్ బుక్ ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉన్నారు. జోర్డాన్ రాణి రానియా అల్ అబ్దుల్లాకు మూడోస్థానం లభించింది. ఆమె ఫేస్ బుక్ పేజీని ఇష్టపడ్డవారి సంఖ్య 1.6 కోట్లు. అయితే, అత్యధిక స్పందనల విషయంలో మాత్రం ట్రంప్ అగ్రస్థానంలో నిలిచారు. ట్రంప్ ప్రసంగాలు, పోస్టులకు 30.9 కోట్ల కామెంట్లు, లైకులు లభించగా, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో 20.5 కోట్ల కామెంట్లు, లైకులతో ద్వితీయస్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో మోదీకి మూడో స్థానం దక్కింది. ఫేస్ బుక్ లో ఆయన పోస్టులకు వచ్చిన స్పందనల సంఖ్య 8.4 కోట్లు అని బీసీడబ్ల్యూ తెలిపింది.