మన ఓడలకు అడ్డంకులు సృష్టిస్తే కాల్చి పారేయండి: ట్రంప్ సంచలన ఆదేశాలు
- తమ ఓడలకు అడ్డుతగులుతోందంటూ ఇరాన్‌పై ఆగ్రహం
- అమెరికా హాలీవుడ్ కథలు చెబుతోందన్న ఇరాన్
- ట్రంప్ ట్వీట్‌తో కలకలం
తమ ఓడలకు అడ్డంకులు సృష్టిస్తే ఇరాన్ గన్‌బోట్లను కాల్చి పారేయాలని తమ నావికా దళానికి ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఉత్తర అరేబియా సముద్రంలోని ఐఆర్‌జీసీకి చెందిన 11 ఓడలు అమెరికా ఓడలకు పదేపదే అడ్డుతగులుతున్నాయని, ఓడలు పరస్పరం ఢీకొట్టకుండా అవసరమైన చర్యలు చేపడతామంటూ ఈ నెల 16న అమెరికా నేవీ ట్వీట్ చేసింది. అమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన ఇరాన్.. హాలీవుడ్ కథలు చెబుతోందంటూ మండిపడింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.