Nagarjuna: ఆగస్టు నుంచి సెట్స్ పైకి 'బంగార్రాజు'

  • నాగార్జునకి పేరు తెచ్చి పెట్టిన పాత్ర 'బంగార్రాజు'
  • ఆ పాత్ర పేరుతోనే సినిమాకి శ్రీకారం
  • కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ
Bangarraju Movie

నాగార్జున కథానాయకుడిగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. నాగార్జున కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో నాగార్జున పోషించిన 'బంగార్రాజు' పాత్ర, ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దాంతో అదే పాత్ర పేరుతో .. అదే దర్శకుడితో సినిమా చేయడానికి నాగార్జున రంగంలోకి దిగారు.

ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లవలసిన ఈ ప్రాజెక్టు కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఈ సారి మాత్రం ఆలస్యం చేయకూడదని నాగార్జున బలంగా నిర్ణయించుకున్నారట. ఆగస్టులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టవలసిందేనని కల్యాణ్ కృష్ణతో నాగార్జున చెప్పినట్టుగా సమాచారం. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఆయన వున్నారు. కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ .. ముఖ్యమైన పాత్రలో నాగచైతన్య నటించనున్నారు.

More Telugu News