Nayanatara: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కమల్ సీక్వెల్ లో నయనతార 
  • భర్తతో జతకడుతున్న సమంత
  • పవన్ సరసన మరోసారి కాజల్
Nayanatara opposite Kamala hassan

 *  గతంలో కమలహాసన్ హీరోగా వచ్చిన 'రాఘవన్' చిత్రానికి దర్శకుడు గౌతం మీనన్ ఇప్పుడు సీక్వెల్ చేసే ఆలోచన చేస్తున్నారు. ఇందులో కమల్ సరసన అనుష్క హీరోయిన్ గా నటిస్తుందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, నయనతార పేరును ప్రస్తుతం దర్శక నిర్మాతలు పరిశీలిస్తున్నారట.
*  భర్త నాగ చైతన్యతో అందాలతార సమంత మరోసారి జతకట్టనుంది. ఆమధ్య సమంతతో 'ఓ బేబీ' చిత్రాన్ని రూపొందించిన నందినిరెడ్డి తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఇందులో చైతు, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఎమోషనల్ డ్రామాగా ఇది తెరకెక్కుతుంది.
*  గతంలో 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నటించిన కాజల్ అగర్వాల్ ఆయనతో కలసి మరోసారి నటించనుంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించడానికి ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో హీరోయిన్ గా కాజల్ ను ఎంచుకున్నట్టు సమాచారం.      

More Telugu News