ap7am logo

ఏపీలో 161కి పెరిగిన కరోనా కేసులు

Fri, Apr 03, 2020, 10:47 AM
  • 12 కొత్త కేసుల నమోదు
  • నెల్లూరులో అత్యధికంగా 32 కేసులు
  • విజయనగరం, శ్రీకాకుళంలో ఒక్క కేసూ లేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రాత్రి 10 గంటల నుంచి నేటి ఉదయం 9 గంటల్లోపు 12 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆరోగ్యాంధ్ర, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "రాష్ట్రంలో గత రాత్రి 10 గంటల తరువాత నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు వచ్చిన ఫలితాలలో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ - 19  కేసుల సంఖ్య 161 కి పెరిగింది" అని పేర్కొంది.
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
GarudaVega Banner Ad