సంగారెడ్డిలో కొత్తగా ఆరుగురికి కరోనా
Add ap7am to your home Screen

సంగారెడ్డిలో కొత్తగా ఆరుగురికి కరోనా

coronavirus cases in telangana
  • చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు
  • వారి కుటుంబ సభ్యులకు క్వారంటైన్‌
  • కలెక్టర్ తో మంత్రి హరీశ్ రావు సమీక్ష
తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు మరిన్ని పెరుగుతున్నాయి. సంగారెడ్డిలో కొత్తగా ఆరుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ విషయంపై సమాచారం అందుకున్న తెలంగాణ మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి హుటాహుటిన సంగారెడ్డికి వెళ్లారు. అక్కడకు చేరుకున్న వెంటనే సంగారెడ్డి కలెక్టర్‌తో హరీశ్‌ రావు సమీక్ష నిర్వహించారు.

కరోనా పాజిటివ్‌ వచ్చిన ఆరుగురిని వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ ఆరుగురి కుటుంబాల సభ్యులను అధికారులు క్వారంటైన్‌లో ఉంచారు. వారు ఎవరెవరిని కలిశారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 100 దాటిన విషయం తెలిసిందే. వైరస్‌ వ్యాప్తి చెందకుండా అధికారులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొత్త కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
Corona Virus
Telangana
Sangareddy District

More Telugu News