తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధింపుపై జీవో జారీ
Add ap7am to your home Screen

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధింపుపై జీవో జారీ

  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నిలకడగా ఉంచేందుకే ఈ నిర్ణయం
  • ప్రభుత్వ రంగ , ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు వర్తింపు
  • మార్చి నెల వేతనాల్లో కోత
కరోనా ప్రభావంతో లాక్ డౌన్ విధించిన దృష్ట్యా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నిలకడగా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం నిన్న కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ రంగ సంస్థల, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగుల మార్చి నెల వేతనాల్లో కొంత మొత్తంపై కోత విధించనుంది. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేసింది. ఇలా కోత విధించిన మొత్తాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక వారికి తిరిగి చెల్లిస్తారని అధికార వర్గాల సమాచారం. ఈ జీవో ప్రకారం ఎవరి వేతనాల్లో ఎంత శాతం కోత విధిస్తారన్న వివరాలను స్పష్టం చేసింది.

- ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో- 75 శాతం  
- ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర  అఖిల భారత సర్వీస్ అధికారుల వేతనాల్లో- 60 శాతం 
- మిగతా అన్ని క్యాటగిరీ ఉద్యోగుల వేతనాల్లో- 50 శాతం
- అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో - 50 శాతం
- నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో- 10 శాతం
- నాల్గవ తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో- 10 శాతం
Telangana
government
Corona Virus
Government Employees
salary
cutting

More Telugu News