Heritage: కరోనా సహాయక చర్యల కోసం 'హెరిటేజ్' రూ.కోటి సాయం

heritage donation one crore for corona eradication programmes
షార్ట్స్‌లో చూడండి

ప్రముఖ వ్యాపార సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ కరోనా సహాయక చర్యల కోసం దేశంలోని ఆరు రాష్ట్రాలకు మొత్తం  కోటి రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించింది. విపత్తు ఎదుర్కొంటున్న ఈ కష్టకాలంలో ఆయా ప్రభుత్వాలు అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు తమవంతు సాయంగా ఈ మొత్తాన్ని అందజేస్తున్నట్లు హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి తెలిపారు. 

ఈ నిధుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రా, తెలంగాణకు చెరో రూ.30 లక్షలు అందజేస్తామని, మిగిలిన నలభై లక్షలను కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలకు రూ.10 లక్షలు చొప్పున అందజేయనున్నట్లు భువనేశ్వరి తెలిపారు. ఈ నిధులను ఆయా రాష్ట్రాల సీఎం సహాయ నిధికి జమ చేస్తామని తెలిపారు.


Go Back to Shorts
Heritage
Corona Virus
eradication programes
one crore

More Telugu News