Nara Lokesh: ఇందుకు జగన్‌ ఇగోయే కారణం!: కరోనాపై నారా లోకేశ్ ట్వీట్

lokesh fires on jagan
షార్ట్స్‌లో చూడండి
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ ఎటువంటి చర్యలూ తీసుకోవట్లేదని, ప్రజలను రక్షించాలన్న బాధ్యత కన్నా ఆయనకు అధికారదాహమే అధికంగా ఉందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు.

దేశంలోని ప్రతి రాష్ట్రం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాయని, పాఠశాలలను మూసేస్తున్నాయని, జనాలు గూమికూడకుండా చర్యలు తీసుకుంటున్నాయని నారా లోకేశ్ తెలిపారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పారు. ఇందుకు జగన్‌ ఇగోయే కారణమని, మరింత అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఆయన పడుతున్న తపన రాష్ట్ర ప్రజలను రక్షించుకోవాలన్న దాని కంటే అధికంగా ఉందని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh

More Telugu News