Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Samantha in heroine oriented flick
షార్ట్స్‌లో చూడండి
 *  అందాలతార సమంత ఇటీవల తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి అంగీకరించింది. అయితే, ఈ చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ కథాంశంతో థ్రిల్లర్ గా రూపొందుతుందని తెలుస్తోంది. ఇందులో 'జీన్స్' ఫేం ప్రశాంత్ హీరోగా నటిస్తాడు. 
*  విష్వక్సేన్ హీరోగా శైలేశ్ కొలను దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'హిట్' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని నిర్మించిన హీరో నాని కూడా ప్రాజక్టు పట్ల హ్యాపీ ఫీలయ్యాడు. ఈ నేపథ్యంలో నానితో కూడా ఓ చిత్రం చేయడానికి శైలేశ్ ప్లాన్ చేస్తున్నాడని, ఇప్పటికే స్టోరీ లైన్ చెప్పాడని అంటున్నారు.
*  ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ జార్జియాలో కొనసాగుతోంది. ఈ చిత్రం షూటింగ్ కోసం వెళ్లిన కథానాయిక పూజ హెగ్డే ఒక రోజు బ్రేక్ రావడంతో నగర సందర్శనకు వెళ్లిందట. అందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
Go Back to Shorts
Samantha
Nani
Prabhas
Pooja Hegde

More Telugu News