Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ద్విభాషా చిత్రానికి ఓకే చెప్పిన సమంత
  • బాలకృష్ణ చిత్రానికి బిజీ రైటర్ 
  • అవికా గోర్ కు మరో ఆఫర్
Samantha opposite Prashanth in a bilingual flick

 *  అందాల సమంత తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఓ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో ప్రశాంత్ హీరోగా నటించనున్నాడు. ఈ చిత్రాన్ని సోని పిక్చర్స్ నిర్మిస్తుంది.
*  సూపర్ హిట్ కాంబినేషన్ గా పేరుతెచ్చుకున్న బాలకృష్ణ, బి.గోపాల్ కలయికలో తాజాగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మే నుంచి షూటింగ్ జరుపుకునే ఈ చిత్రానికి బిజీ రైటర్ సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నాడట.  
*  చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ సరసన అవికా గోర్ కథానాయికగా నటించనుంది. కల్యాణ్ దేవ్ హీరోగా ప్రముఖ రచయిత శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో కథానాయిక పాత్రకు అవికా గోర్ ను తీసుకున్నట్టు తాజా సమాచారం.  

More Telugu News