Karanam Balaram: వైసీపీలో చేరతానని అధికారికంగా ప్రకటించి.. జగన్‌ వద్దకు బయల్దేరిన టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం

karanam balaram to join in ycp
షార్ట్స్‌లో చూడండి
ప్రకాశం జిల్లాలో టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది. చీరాల టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కరణం బలరాం పార్టీని వీడనున్నట్టు ఇటీవల ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే నిజమైంది. ఆయనతో పాటు పలువురు ప్రకాశం జిల్లా నేతలు వైసీపీలో చేరనున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు బలరాం అధికారికంగా ప్రకటన చేశారు.

తన నియోజకవర్గ కార్యకర్తల కోరిక మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కరణం బలరాం మీడియాకు తెలిపారు. తన నియోజక వర్గ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. కాసేపట్లో ఆయన జగన్‌ను కలవనున్నారు. చీరాల మండలం రామకృష్ణాపురం నుంచి తన మద్దతుదారులతో ఆయన భారీ ర్యాలీగా తాడేపల్లిలోని జగన్ క్యాంప్‌ కార్యాలయానికి బయలుదేరారు.
Go Back to Shorts
Karanam Balaram
Telugudesam
YSRCP

More Telugu News