నితిన్ 'రంగ్ దే' వచ్చేది అప్పుడేనట
- 'భీష్మ'తో హిట్ కొట్టిన నితిన్
- షూటింగు దశలో 'రంగ్ దే'
- దేవిశ్రీ సంగీతం ప్రత్యేక ఆకర్షణ
నితిన్ కథానాయకుడిగా దర్శకుడు వెంకీ అట్లూరి 'రంగ్ దే' సినిమాను రూపొందిస్తున్నాడు. సితార బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో, కథానాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. జూన్ నాటికి ఈ సినిమా షూటింగును పూర్తి చేసి, జూలై చివరిలోగానీ, ఆగస్టు మొదటివారంలో గాని విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.