Manchu Manoj: యాక్షన్ లోకి దిగిపోతున్న మంచు హీరో

  • మంచు మనోజ్ నుంచి 'అహం బ్రహ్మాస్మి'
  • రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు 
  •  అఘోరగా కనిపించనున్న మనోజ్   
Aham Brahmansmi Movie

మంచు మనోజ్ సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బ్యానర్ పై తొలి చిత్రంగా 'అహం బ్రహ్మాస్మి'ని నిర్మిస్తున్నాడు. రేపటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును జరుపుకోనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ షెడ్యూల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ప్లాన్ చేశారు.

తదుపరి షెడ్యూల్ ను మే నెల మొదటివారం నుంచి ప్రారంభించనున్నారు. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ అఘోర లుక్ తోను కనిపించనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

More Telugu News