Mehrin: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • రూటు మారుస్తున్న మెహ్రీన్ 
  • త్రివిక్రమ్ తో పవన్ ప్రాజక్ట్ 
  • అనూ ఇమ్మానుయేల్ కు మరో ఆఫర్
Mehrin to act in web series

 *  డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన సమంత, కాజల్, తమన్నా వంటి స్టార్ హీరోయిన్ల బాటలో యువ కథానాయిక మెహ్రీన్ కూడా నడుస్తోంది. త్వరలోనే ఆమె ఓ హిందీ వెబ్ సీరీస్ లో నటించనున్నట్టు, ఈ విషయంలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం.
*  ప్రస్తుతం పలు చిత్రాలలో నటించడానికి ప్లాన్ చేసుకుంటున్న పవన్ కల్యాణ్ తవ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయడానికి కూడా రెడీ అవుతున్నాడట. ఈ విషయంలో తన కోసం ఓ కథను సిద్ధం చేయాల్సిందిగా త్రివిక్రమ్ ను పవన్ కోరినట్టు తెలుస్తోంది.
*  అందాలతార అనూ ఇమ్మానుయేల్ త్వరలో అల్లు శిరీష్ సరసన కథానాయికగా నటించనుంది. రాకేశ్ శశి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో వీరిద్దరూ జంటగా నటిస్తారు. ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

More Telugu News