Rahul Sipligunj: కేటీఆర్ సర్... ఇలాంటి పరిస్థితిని నేనెందుకు ఎదుర్కోవాలి?: వీడియో విడుదల చేసిన రాహుల్ సిప్లిగంజ్

  • తనకు న్యాయం చేయాలంటూ కేటీఆర్ ను కోరిన రాహుల్
  • ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
  • తన తప్పు ఉంటే కఠిన చర్యలకైనా సిద్ధమేనన్న రాహుల్
Rahul Sipligunj requests KTR to look into the matter

హైదరాబాద్ లోని ఓ పబ్ లో ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ ఎమ్మెల్యే సోదరుడి హస్తం ఉందని రాహుల్ ఆరోపిస్తున్నాడు. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన రాహుల్ తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేశాడు. తనను పబ్ లో దారుణంగా కొడుతున్న దృశ్యాలతో ఓ వీడియోను రాహుల్ ట్వీట్ చేశాడు. "కేటీఆర్ సర్, దీనిపై సరైన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. మీరు ఇందులో జోక్యం చేసుకోవాలి. నా వైపు నుంచి ఎలాంటి తప్పు ఉందని తేలినా కఠిన చర్యలకైనా సిద్ధమే. కానీ ఇక్కడ నేనో, ఓ సామాన్యుడో ఎలాంటి తప్పు చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు చిక్కుకోవాలి?"​ అంటూ ఎంతో ఆవేదనతో ట్వీట్ చేశాడు.

More Telugu News