Rahul Sipligunj: మా అబ్బాయిపై దాడి విషయాన్ని టీవీలో చూసే తెలుసుకున్నాం: రాహుల్ సిప్లిగంజ్‌ తల్లి

  • ఓ మిటింగ్‌ ఉన్న నేపథ్యంలో వెళ్లాడు
  • రాత్రి ఇంటికి రాలేదు
  • వాళ్ల నాన్న ఫోను చేసి కాసేపు మాట్లాడారు
  • ఏ ఆసుపత్రిలో ఉన్నాడన్న విషయం కూడా నాకు తెలియదు 
rahul Sipligunj mother reacts on attack over her son in pub exclusive

తెలుగు బిగ్‌బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో బీరు బాటిళ్లతో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ విషయంపై ఆయన తల్లి స్పందించారు. ఈ దాడి గురించి తనకేం తెలియదని ఆమె చెబుతున్నారు.

'నిన్న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లాడు.. ఓ మీటింగ్‌ ఉన్న నేపథ్యంలో వెళ్లాడు. రాత్రి ఇంటికి రాలేదు.. వాళ్ల నాన్న ఫోను చేసి కాసేపు మాట్లాడారు. ఉదయం టీవీలో న్యూస్‌ చూసి దాడి విషయాన్ని తెలుసుకున్నాం. ఓ పని మీద బయటకు వెళ్లాడు.. దాడి గురించి మాకు ఏమీ తెలియదు. ఏ ఆసుపత్రిలో ఉన్నాడన్న విషయం కూడా నాకు తెలియదు. నా భర్త ఆసుపత్రికి వెళ్లారు. కాసేపట్లో నేను కూడా ఆసుపత్రికి వెళ్తాను' అని చెప్పారు. కాగా, ఈ దాడిపై ఇప్పటివరకు రాహుల్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.

More Telugu News