Rakul Preet Singh: నేను చేసిన ఆ తప్పే అవకాశాలు తగ్గేలా చేసింది: వాపోతున్న రకుల్ ప్రీత్ సింగ్
- గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇచ్చాను
- నటనకు అవకాశమున్న పాత్రలను ఎంచుకోలేకపోయాను
- తాజా ఇంటర్వ్యూలో వాపోయిన రకుల్ ప్రీత్ సింగ్
గత కొంతకాలంగా రకుల్ ప్రీత్ సింగ్ కు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. హిట్ సినిమాల్లో నటించిన చరిత్ర ఉన్నా, తనతో పాటు సినీ రంగంలోకి వచ్చిన మిగతా హీరోయిన్లతో పోలిస్తే, రకుల్ అనుకున్నంతగా అవకాశాలను అందుకోలేకపోయింది. మెగా హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నా, ఆ పేరు అవకాశాలను తెచ్చి పెట్టలేదు.
ఇక ఇదే విషయాన్ని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించిన రకుల్, తాను వరుసగా గ్లామర్ పాత్రలను చేస్తూ, అందాలను ఆరబోయటమే, పెద్ద తప్పయి పోయిందని వాపోయింది. నటనకు ఆస్కారం ఉండే పాత్రలను ఎంచుకోలేకపోయానని, అదే తనకు ఇప్పుడు అవకాశాలు తగ్గేలా చేసిందని అభిప్రాయపడిందని, తాను నిర్మాతలను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని, అనుకున్న సమయానికే షూటింగ్ కు వెళ్లేదాన్నని చెప్పింది. గ్లామరస్ గా కనిపించే పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వడం ఎంత తప్పో ఇప్పుడు తెలిసి వచ్చిందని వ్యాఖ్యానించింది.