Nara Lokesh: జర్నలిస్టు మిత్రుల కాలు విరగ్గొట్టిన ఘటన నన్ను తీవ్రంగా బాధించింది: నారా లోకేశ్

lokesh fires on ycp leaders
షార్ట్స్‌లో చూడండి
తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ నేత నారా లోకేశ్‌ పర్యటించిన నేపథ్యంలో వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జర్నలిస్టు మిత్రుల కాలు విరగ్గొట్టారని లోకేశ్ చెప్పారు.

నాన్నగారిని, నన్ను అడ్డుకోడానికి జగన్‌ గారు పడుతున్న కష్టంలో పది శాతం రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడినా రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఉండేవి కావు. కక్ష సాధింపే లక్ష్యంగా, రౌడీయిజమే ఊపిరిగా ముందుకి వెళ్లాలనుకుంటే మీ ఇష్టం జగన్ గారు. కానీ మీడియా ప్రతినిధులేం చేశారు?' అని ప్రశ్నించారు.
 
'మమ్మల్ని అడ్డుకొనే పనిలో భాగంగా వైకాపా రౌడీలు మీడియా ప్రతినిధుల పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా ప్రజా చైతన్యయాత్ర కవరేజ్ కి వచ్చి వెళ్తున్న మీడియా ప్రతినిధుల పై విచక్షణారహితంగా దాడి చేసి, జర్నలిస్టు మిత్రుల కాలు విరగ్గొట్టిన ఘటన నన్ను తీవ్రంగా బాధించింది' అని చెప్పారు.

'ఇదేనా మీరు తెస్తానన్న రాక్షస రాజ్యం. వైకాపా దాడిలో గాయపడిన ముగ్గురు జర్నలిస్టు మిత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News