Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Pooja Hegde in Tamil flick after years
  • చాలా ఏళ్ల తర్వాత తమిళంలో పూజ 
  • 'లవ్ స్టోరీ' విడుదల వాయిదా లేదు 
  • విజయ్ 'మాస్టర్' షూటింగ్ పూర్తి 
 *  పలు హిట్ సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్న అందాలతార పూజ హెగ్డే చాలా ఏళ్ల తర్వాత తమిళంలో నటించడానికి అంగీకరించింది. విజయ్ హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో రూపొందే చిత్రంలో పూజ హీరోయిన్ గా ఎంపికైంది. ఇందుకోసం భారీ పారితోషికాన్ని ఆమె తీసుకుంటోంది.
*  అక్కినేని నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్ స్టోరీ' చిత్రం విడుదల వాయిదా పడనుందంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే, ఇందులో వాస్తవం లేదని, అనుకున్నట్టుగానే ఏప్రిల్ 2న విడుదలవుతుందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది.
*  తమిళ నటుడు విజయ్ హీరోగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మాస్టర్' చిత్రం షూటింగ్ నిన్నటితో మొత్తం పూర్తయింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా నటించగా, మాళవిక మోహన్ హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని రెండు భాషల్లోనూ ఏకకాలంలో రిలీజ్ చేస్తారు.
        

More Telugu News

Pooja Hegde
Vijay
Naga Chaitanya
Sai Pallavi