ఇచ్చట పాత రికార్డులు సవరించబడును: 'వకీల్ సాబ్' కు స్వాగతం పలికిన దర్శకుడు మారుతి
- పవన్ వకీల్ సాబ్ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్
- రెండేళ్ల గ్యాప్ తర్వాత నటిస్తున్న పవన్
- హోరెత్తిపోతున్న ట్విట్టర్
'వకీల్ సాబ్' లుక్ పై దర్శకుడు మారుతి తనదైన శైలిలో స్పందించారు. 'ఇచ్చట పాత రికార్డులు సవరించబడును' అంటూ ట్వీట్ చేశారు. మారుతి మాత్రమే కాదు, యావత్ మెగా హీరోలు పవన్ రాకను స్వాగతించారు. దేవిశ్రీప్రసాద్ తమన్, గోపీచంద్ మలినేని, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి ట్విట్టర్ లో తమ హర్షం వ్యక్తం చేశారు. వచ్చేస్తున్నాడు పవర్ స్టార్ అంటూ ట్వీట్లతో సందడి చేశారు.
మరోవైపు, నివేదా థామస్, లావణ్య త్రిపాఠి తదితర హీరోయిన్లు కూడా 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ పై స్పందించారు. అటు, 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ లో దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. వారితో కలిసి దిల్ రాజు, తమన్ కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. హిందీలో హిట్టయిన పింక్ చిత్రాన్ని తెలుగులో పవన్ ప్రధానపాత్రలో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ సినిమాలో ఇతర తారాగణాన్ని ప్రకటించాల్సి ఉంది.