సీక్వెల్ దిశగా 'ఏ మాయ చేసావె'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీక్వెల్ దిశగా 'ఏ మాయ చేసావె'

Gautham Vasudeva Menon Movie
  • తమిళంలో 'విన్నైతాండి వరువాయ' హిట్ 
  • తెలుగులో వచ్చిన  'ఏ మాయ చేసావె' సక్సెస్ 
  • తమిళ సీక్వెల్ నాయికగా అనుష్క?
తెలుగు .. తమిళ భాషల్లో దర్శకుడిగా గౌతమ్ మీనన్ కి మంచి పేరు వుంది. ప్రేమకథా చిత్రాలను చక్కని ఫీల్ తో తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. పదేళ్ల క్రితం తమిళంలో అయన రూపొందించిన 'విన్నైతాండి వరువాయ' సినిమా భారీ విజయాన్ని సాధించింది. శింబు కథానాయకుడిగా నటించిన ఆ సినిమాలో కథానాయికగా త్రిష సందడి చేసింది.

తెలుగులో ఆ సినిమాను 'ఏ మాయ చేసావె' టైటిల్ తో రూపొందించగా, ఇక్కడ కూడా ఘన విజయాన్ని అందుకుంది. చైతూ జోడీగా సమంత నటించిన ఈ సినిమా వాళ్ల కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోయింది. తమిళంలో ఒరిజినల్ వెర్షన్ కి సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి గౌతమ్ మీనన్ వచ్చాడు. 'విన్నైతాండి వరువాయ 2'కి కథను సిద్ధం చేశాను. శింబు ఓకే అనాలేగానీ సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా వున్నాను' అని ఆయన అన్నాడు. ఈ సినిమాలో శింబు జోడీగా ఆయన అనుష్కను తీసుకోవాలని అనుకుంటున్నాడట. ఇక తెలుగులోను సీక్వెల్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.
Simbu
Anushka
Gautham Vasudeva Menon Movie

More Telugu News