నిన్నటి విశాఖ ఘటనలో ఒక్కరిని కూడా ఎందుకు అరెస్టు చేయలేదు?: సబ్బం హరి
- చంద్రబాబును అడ్డుకున్న వారిని పక్కకు తప్పించరా?
- పోలీసులకు ‘ఇంగిత జ్ఙానం’ కూడా లేదు
- ఆరోజు డ్యూటీలో ఉన్న అధికారులను విశాఖ సీపీ ప్రశ్నించాలి?
చంద్రబాబును అడ్డుకున్న వారిని పక్కకు తప్పించి ఆయన్ని ఎందుకు ముందుకు పంపించలేదని డ్యూటీలో ఉన్న అధికారులను ప్రశ్నించాల్సిన బాధ్యత విశాఖ సీపీకి ఉందని, ఆ విధంగా ఆయన ప్రశ్నించకపోతే ఈ గూడుపుఠాణిలో సీపీ పాత్ర ఉందని భావించాల్సి వస్తుందని అన్నారు. అల్లరి మూకతో గొడవ చేయించి చంద్రబాబును వెనక్కి పంపించామని వైసీపీ నేతలు పండగ చేసుకోవడం కాదని, ఆయన్ని అణగదొక్కాలనుకుంటే అంతకంతగా ఎదుగుతారని అన్నారు.