సమంత చేయనున్నది హారర్ చిత్రమేనట!
- అశ్విన్ శరవణన్ నుంచి మరో హారర్ థ్రిల్లర్
- ప్రధాన పాత్రధారిగా సమంత
- త్వరలోనే సెట్స్ పైకి
ఈ నేపథ్యంలో ఈ సినిమా ఏ జోనర్లో ఉంటుందోననే ఆసక్తి ఏర్పడింది. ఈ సారి కూడా అశ్విన్ శరవణన్ హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథనే ఎంచుకున్నాడట. అడుగడుగునా ఉత్కంఠను రేకెత్తిస్తూ, అనుక్షణం భయపెట్టే పాత్రలోనే సమంత కనిపించనుందని అంటున్నారు. తమిళంతో పాటే తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 'రాజుగారి గది 2' వంటి హారర్ థ్రిల్లర్ చిత్రంలో నటించిన అనుభవమున్న సమంత, తాజా హారర్ మూవీలో ఒక రేంజ్ లో భయపెట్టేయడం ఖాయమనే అనుకోవచ్చు.