China: చైనాకు వైద్య సాయం.. మన విమానానికి లభించిన అనుమతి

షార్ట్స్‌లో చూడండి
కోవిడ్ వైరస్ బారినపడ్డ చైనాకు వైద్య సాయం అందించేందుకు భారత ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైంది. సైనిక విమానం ద్వారా  వైద్య పరికరాలను తరలించాలని ఈ నెల 20న సన్నద్ధం కూడా అయింది. అయితే, చైనా నుంచి అనుమతి లభించడంలో జాప్యం జరిగింది. దాదాపు ఐదు రోజుల తర్వాత ఈ విమానానికి ఇప్పుడు అనుమతి లభించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రేపు వూహాన్ నగరానికి ఈ విమానం బయలుదేరే అవకాశం ఉందని చెప్పారు. వైద్య పరికరాలను చైనా అధికారులకు అందజేసిన అనంతరం అక్కడున్న భారతీయులను తీసుకుని ఆ మర్నాడు తిరిగి విమానం బయలుదేరుతుందని సమాచారం.
Go Back to Shorts
China
carona
medical aim
India
flight

More Telugu News