ఉత్కంఠకు గురిచేసే 'నారప్ప' ఫైట్స్
పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీన్స్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీన్స్ ను గురించి పీటర్ హెయిన్స్ మాట్లాడుతూ .."కథను బట్టి ఈ సినిమా యాక్షన్ సీన్స్ ను నేను కొత్తగా డిజైన్ చేశాను. చూసే ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారు. ఇంతవరకూ 27 రోజులుగా ఈ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తూ వస్తున్నాము. మరికొన్ని రోజులు షూటింగ్ జరగవలసి వుంది. ఇంతవరకూ వచ్చిన అవుట్ పుట్ నాతో పాటు యూనిట్ లోని అందరికీ సంతృప్తిని కలిగించింది. ఈ సినిమాకి యాక్షన్ సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పగలను" అన్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని మణిశర్మ అందిస్తున్న సంగతి తెలిసిందే.