Samantha: అందుకే ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పాను: సమంత

samantha about her new movie
షార్ట్స్‌లో చూడండి
విజయ్ సేతుపతి హీరోగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తమిళ చిత్రం 'కాత్తువక్కుల రెందు కాదల్' సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో నయనతార కూడా నటిస్తోంది. ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత పలు విషయాలు తెలిపింది.

ఆసక్తికర, విభిన్న కథల కోసం తాను ఎదురుచూస్తున్న సమయంలో తన వద్దకు ఈ సినిమా ఆఫర్ వచ్చిందని తెలిపింది. ఈ సినిమా కథ తనకు బాగా నచ్చిందని చెప్పింది. నయనతార, విజయ్ సేతుపతి పక్కన ఉత్తమంగా నటించడం ఒక సవాలుగా భావించానని తెలిపింది. ఈ కారణాల వల్లే తాను ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పానని వెల్లడించింది.
Go Back to Shorts
Samantha
Tollywood
cinema

More Telugu News