కమలహాసన్ ‘భారతీయుడు-2’ సెట్స్‌లో దుర్ఘటన.. ముగ్గురి మృతి
- మృతుల్లో దర్శకుడు శంకర్ వ్యక్తిగత సహాయకుడు, అసిస్టెంట్ డైరెక్టర్
- 150 అడుగుల పైనుంచి తెగిపడిన క్రేన్
- మరో పదిమందికి గాయాలు
శంకర్ దర్శకత్వంలో శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతుండగా నిన్న రాత్రి 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ ప్రమాదవశాత్తు తెగి కింది ఉన్న టెంట్‌పై పడింది. ఈ ఘటనలో టెంట్ కింద ఉన్న వారిలో శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు (29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ(34), సహాయకుడు చంద్రన్ ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.
క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ప్రమాదంపై స్పందించిన కమల్.. ఈ ఘటన తన మనసును కలచివేసిందన్నారు. ముగ్గురిని కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. వారి కన్నవారి కంటే తన బాధ ఎన్నో రెట్లు ఎక్కువని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.