సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్
- ముగింపు దశలో అఖిల్ 'బ్యాచ్ లర్'
- తదుపరి సినిమాకి సన్నాహాలు
- ఏప్రిల్ తరువాత సెట్స్ పైకి
ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాను ఏప్రిల్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా ముగింపు దశలో ఉండగానే తదుపరి ప్రాజెక్టును అఖిల్ సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. 'సైరా' తరువాత ఆయన ఒకటి రెండు ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. దాంతో అఖిల్ కి కథ వినిపించి ఓకే అనిపించుకున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.