'కేజీఎఫ్ 2' కోసం రమ్యకృష్ణ భారీ పారితోషికం అడిగిందట!
- షూటింగు దశలో 'కేజీఎఫ్ 2'
- ప్రతినాయక పాత్రలో సంజయ్ దత్
- యశ్ సరసన నాయికగా శ్రీనిధి శెట్టి
అయితే ఆ సినిమాకి గల భారీతనాన్ని .. ఆ పాత్ర ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని రమ్యకృష్ణ పెద్ద మొత్తంలోనే పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. దాంతో వాళ్లు రవీనా టాండన్ ను తీసుకున్నారట. యష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా సంజయ్ దత్ కనిపించనున్నాడు. ఒక ముఖ్యమైన పాత్రను రావు రమేశ్ పోషిస్తున్నాడు. మొదటి భాగం సంచలన విజయాన్ని సాధించడంతో, సహజంగానే రెండవ భాగంపై భారీ అంచనాలు వున్నాయి.