'లవ్ స్టోరీ' నుంచి రానున్న 'ఏయ్ పిల్లా' సాంగ్
- మరో ప్రేమకథా చిత్రంతో శేఖర్ కమ్ముల
- తెలంగాణ యాసలో మాట్లాడనున్న చైతూ
- వేసవిలో ప్రేక్షకుల ముందుకు
'ఫిదా' హిట్ తరువాత శేఖర్ కమ్ముల నుంచి రానున్న సినిమా కావడంతో అందరిలో అంచనాలు పెరుగుతున్నాయి. 'ఫిదా'లో సాయి పల్లవి తెలంగాణ యాస మాట్లాడితే, ఈ సినిమాలో చైతూ తెలంగాణ యాస మాట్లాడనున్నాడు. ఈ సినిమా కోసం ఆయన తెలంగాణ యాస నేర్చుకోవడం విశేషం. నారాయణ దాస్ నారంగ్ .. రామ్ మోహన్ రావ్ నిర్మిస్తున్న ఈ సినిమాను వేసవిలో విడుదల చేయనున్నారు.