Donald Trump: ఖరారైన డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన!

  • 24, 25 తేదీల్లో పర్యటన
  • రక్షణ రంగంపై మోదీతో చర్చలు
  • ట్రంప్ తో పాటు రానున్న మెలానియా
Schedule of Donald Trump India Tour confirmed

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఖరారైంది. వైట్ హౌస్ తాజాగా వెలువరించిన సమాచారం ప్రకారం, ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్ లో పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల పాటు ట్రంప్ సెక్యూరిటీ ఏర్పాట్లను అమెరికా, భారత్ సంయుక్తంగా చూసుకుంటాయి.

ఇక ఈ పర్యటనలో భాగంగా రక్షణ రంగం బలోపేతంపై ట్రంప్ తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చించనున్నారు. ట్రంప్ తో పాటు ఇండియాకు రానున్న మెలానియా, ఢిల్లీతో పాటు అహ్మదాబాద్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని భారత అధికారులకు శ్వేతసౌధం నుంచి వర్తమానం అందింది.

More Telugu News